HI WELCOME TO KANSIRIS

save marriges

Leave a Comment
ఎంత పని ఒత్తిడి ఉన్నా రోజూ కొంత సమయం భార్యాభర్తలు తమ కోసం కేటాయించుకొని మాట్లాడుకోవాలి. ఇంటి బాధ్యతలు, ఆర్థిక విషయాలు, కుటుంబ సభ్యుల గురించి చర్చించుకోవాలి. భాగస్వామి చెప్పే విషయాలను వారి స్థానంలో ఉండి ఆలోచించాలి. 
కుటుంబంతో కలిసి ఏడాదికి ఒకసారైనా విహార యాత్రలకు వెళ్తుండటం వల్ల వారి బంధం మరింత బలపడుతుంది. 
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినపుడు అహాన్ని పక్కన పెట్టి ఎవరో ఒకరు ముందు మాట్లాడాలి. అంతేకానీ బంధం తెగే వరకు గొడవను పెంచుకోకూడదు. 
శారీరక సుఖం కోసం బయట ఎక్కడా వెంపర్లాడకుండా జీవిత భాగస్వామితోనే నెరవేరేలా చూసుకోవాలి. 
జీవిత భాగస్వామి పడే కష్టాన్ని గుర్తించాలి. వారి మీద మీకున్న ప్రేమను తరచూ వ్యక్తపరుస్తుండాలి. 
వారిలోని చిన్నచిన్న లోపాలను, పొరపాట్లను ఎత్తి చూపడం మానేసి ఒకరినొకరు గౌరవించుకోవాలి. 
జీవిత భాగస్వామి ఏదైనా తప్పు చేసినా, తనంతట తాను తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలి. 
అవసరమైతే మానసిక వైద్యులను సంప్రదించాలి. పోలీస్‌స్టేషన్లు, కుటుంబ న్యాయస్థానంలో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.